నిందలు వేయడం దయ్యాలు వేదం వల్లిస్తున్నట్టే ఉంది: విజయశాంతి

ABN , First Publish Date - 2021-07-22T02:52:27+05:30 IST

నిందలు వేయడం దయ్యాలు వేదం వల్లిస్తున్నట్టే ఉంది: విజయశాంతి

నిందలు వేయడం దయ్యాలు వేదం వల్లిస్తున్నట్టే ఉంది: విజయశాంతి

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత పెగాసస్ నుండి ఎలాంటి సాఫ్ట్‌వేర్ కొనుగోలు చెయ్యలేదని భారత ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. పెగాసస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించిందని చెప్పారు. కొన్ని ఎన్జీవోలకు వస్తున్న విదేశీ నిధులపై నియంత్రణ ఏర్పడిన దృష్ట్యా, ఆ సంస్థలు అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బ తీసే ప్రయత్నంలో ప్రతిపక్షాలు భాగస్వామ్య పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందనే విషయమై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఒక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలని సూచించారు.


2010లో జరిగిన ఇండియన్ కార్పోరేట్ వీక్ సదస్సులో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ... పన్నులు ఎగ్గొట్టే కార్పోరేట్ సంస్థలు, హవాలా కార్యకలాపాలు, జాతీయ భద్రత తదితర అంశాల్లో ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చెయ్యడాన్ని సమర్ధించుకున్నారని గుర్తుచేశారు. గత యుపిఎ-2 సర్కారు హయాంలో సుమారుగా 7 వేలకు పైగా ఫోన్లు, దాదాపు 500 ఈమెయిల్ అకౌంట్స్‌పై ప్రభుత్వం నిఘా పెట్టినట్టు 2013 నాటి ఒక ఆర్టీఐ దరఖాస్తుకు బదులు వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆ చర్యలన్నిటికీ సాక్ష్యాలున్నాయన్నారు. కానీ, ఆ ప్రభుత్వాల్లో భాగస్వామ్యం ఉన్న నేతలు నేడు కేంద్ర ప్రభుత్వంపై నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం దయ్యాలు వేదం వల్లిస్తున్నట్టే ఉందన్నారు. 

Updated Date - 2021-07-22T02:52:27+05:30 IST