Abn logo
Jul 22 2021 @ 07:51AM

మైలవరంలో ఈదుగాలులతో భారీ వర్షాలు

విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షంతో పాటు భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలకు మైలవరం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలుతున్నాయి. మరోవైపు వర్షాల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు.