కాలే కడుపులు

ABN , First Publish Date - 2020-07-09T15:27:33+05:30 IST

కాలం కాటు వేసింది. కరోనా కరువు తెచ్చింది. బతుకు బరువైంది..

కాలే కడుపులు

విజయవాడ(ఆంధ్రజ్యోతి): కాలం కాటు వేసింది. కరోనా కరువు తెచ్చింది. బతుకు బరువైంది. కూలీ పనులు, ఇతర చిన్నాచితకా పనులు చేసుకునే వారి పరిస్థితి దయనీయంగా మారింది. అన్నదాతలు వస్తే ఆకలి తీరుతుంది. లేదంటే కడుపు కాలుతోంది. ఈ మంటలు కూడా కాలే కడుపు నుంచి వచ్చినవే. ప్రమాదకరమని తెలిసినా కృష్ణానదిలో దిగి చిల్లర నాణేలు, ఇనుప డబ్బాలు, వైర్లను అయస్కాంతం సాయంతో ఏరుకొచ్చి.. కాల్చి.. వచ్చిన ఇనుమును అమ్ముకుని పొట్టపోసుకుంటున్న అభాగ్యులు వీరు. ఆకలి మంటలకు సజీవ సాక్ష్యాలు వీరు.


కనకదుర్గమ్మ వారధి కింద కృష్ణాతీరాన కనిపించిన చిత్రాలివి..





Updated Date - 2020-07-09T15:27:33+05:30 IST