విజయవాడ: స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధం

ABN , First Publish Date - 2020-08-11T17:25:25+05:30 IST

స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి.

విజయవాడ: స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధం

విజయవాడ: స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి.  ఫైర్, విద్యుత్, వైద్య మరియు భద్రతా కమిటీలు నివేదికలను సిద్ధం చేశాయి.  ఈ రోజు సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్‌కు కమిటీలు నివేదిక ఇవ్వనున్నాయి. 


నివేదికలో కీలకాంశాలు ఇవే:-

స్వర్ణా ప్యాలెస్‌ లో అగ్ని ‌ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇవ్వలేదు.

కొద్దిసేపు ప్రయత్నించి మంటలు చెలరేగిన తర్వాత ఫైర్‌కి సమాచారం.

అగ్ని ప్రమాదం గుర్తించే కనీస పరికరాలు, స్మోక్ డిటెక్టర్, పని చేయని అలారం వల్లే అత్యధిక మంది మృతి.

రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం.

రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదు.

కోవిడ్ పేషేంట్స్ నుంచి భారీగా వసూలు చేసినట్టు నివేదిక.

అనుమతికి మించి పేషేంట్స్‌ను చేర్చుకున్నట్టు నివేదిక.

భద్రతా ప్రమాణాలు లేకపోయినా స్వర్ణా ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటుకు అనుమతి. 

* షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు చాలా తక్కువని, కలప, ఫైబర్‌తో చేసిన ఇంటీరియర్ డెకరేషన్‌కు సానిటైజేషన్ వాడకం ఎక్కువగా ఉండటం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని విద్యుత్ శాఖ కమిటీ నివేదిక.

Updated Date - 2020-08-11T17:25:25+05:30 IST