విజయవాడలో హౌస్ కీపింగ్ వర్కర్ల నిరసన

ABN , First Publish Date - 2021-03-02T17:20:57+05:30 IST

నగరంలోని ఆర్ అండ్ బి బిల్డింగ్స్‌లో పనులు నిలిపివేసి హౌస్ కీపింగ్ వర్కర్లు నిరసనకు దిగారు.

విజయవాడలో హౌస్ కీపింగ్ వర్కర్ల నిరసన

విజయవాడ: నగరంలోని ఆర్ అండ్ బి బిల్డింగ్స్‌లో పనులు నిలిపివేసి హౌస్ కీపింగ్ వర్కర్లు నిరసనకు దిగారు. యశ్వంత్ ఫెసిలిటీ సర్వీస్ కాంట్రాక్టర్ నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హౌస్ కీపింగ్ వర్కర్లు... పనులు మానివేసి ఆర్‌అండ్‌బి బిల్డింగ్స్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. నాలుగేళ్లుగా  కేవలం రూ.6,500 వేల జీతంతో హౌస్ కీపింగ్ వర్కర్లు పనులు చేస్తున్నారు. ఆటోలకు చార్జీలు పెట్టుకొని పనికి వస్తున్నామని ... బ్రతుకు భారమై ఆందోళనకు దిగామని, సీఎం జగన్ తమకు జీతాలు ఇప్పించాలని హౌస్ కీపింగ్ వర్కర్స్  వేడుకుంటున్నారు. హౌస్ కీపింగ్ వర్కర్స్ పనులు మానివేయడంతో రాష్ట్ర ఎన్నికల కార్యాలయం సహా పలు కార్యాలయాల్లో  పారిశుధ్య పనులు ఆగిపోయాయి. 

Updated Date - 2021-03-02T17:20:57+05:30 IST