Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయవాడ ఏసీపీకి వారం జైలు శిక్ష విధించిన హైకోర్టు

విజయవాడ: విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు వారం రోజులపాటు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టును ఏసీపీ తప్పుదోవ పట్టించారని హైకోర్టు మండిపడింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఛార్జిషీట్‌ వేయాలని ఆదేశించినా ఏసీపీ శ్రీనివాసరావు పట్టించుకోలేదని హైకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును హైకోర్టు వారంరోజులు వాయిదా వేసింది.

Advertisement
Advertisement