Abn logo
Sep 9 2021 @ 07:50AM

Vijayawada విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

విజయవాడ: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. నరసరావుపేట పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్  విమానాశ్రయం చేరుకోనున్నారు. ఈ క్రమంలో లోకేష్‌ను విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది. నలుగురు ఏసీపీల పర్యవేక్షణలో వంద మంది పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొన్నారు. విమానాశ్రయం పరిసరాలు, జాతీయ రహదారిపై అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు మరికొద్ది సేపట్లో  నటుడు సోనుసూద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. సోనూసూద్ సెక్యూరిటీ కోసం వచ్చిన బౌన్సర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు పనితీరుపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు సోనూసూద్‌ను చూడడానికి వచ్చిన అభిమానులకు ఎయిర్పోర్ట్ వద్ద ఎదురుదెబ్బ తగిలింది.