ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అండగా విజయవాడ అమ్మాయి!

ABN , First Publish Date - 2021-04-18T00:21:45+05:30 IST

ఆటిజం, ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు అండగా నిలుస్తూ.. విజయవాడకు చెందిన అమ్మాయి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. ఆన్‌లైన్‌లో డ్యాన్స్ క్లాసులను చెప్పడం ద్వారా ఆదాయాన్ని

ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అండగా విజయవాడ అమ్మాయి!

అమరావతి: ఆటిజం, ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు అండగా నిలుస్తూ.. విజయవాడకు చెందిన అమ్మాయి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. ఆన్‌లైన్‌లో డ్యాన్స్ క్లాసులను చెప్పడం ద్వారా ఆదాయాన్ని పొందుతూ.. ఆ మొత్తాన్ని ప్రత్యేక అవసరాలుగల పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన నరసింహ, అరుణ దంపతులు గత 20ఏళ్లుగా కాలిఫోర్నియాలో నివసిస్తూ అక్కడే స్థిరపడ్డారు. వారి కుమార్తె ఐశ్వర్య స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలోనే ఆటిజం, ప్రత్యేక అవసరాలున్న పిల్లల గురించి ఐశ్వర్య తెలుసుకుంది.



అంతేకాకుండా.. వారికి ఎలా అయినా సరే అండగా నిలవాలని నిర్ణయించుకుంది. కూచుపూడి డ్యాన్సు క్లాసులు చెప్పడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారి కోసం ఖర్చు చేయాలని డిసైడ్ అయింది. సరిగ్గా అప్పుడే.. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విజృంభణ మొదలైంది. అయినా సరే తన ప్రయత్నాన్ని ఆ చిన్నారి విరమించుకోలేదు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సహాయం చేసేందుకు ఆన్‌లైన్ బాటపట్టింది. అంతర్జాలంలో కూచుపూడి క్లాసులు నిర్వహిస్తూ.. ఆదాయాన్ని పొందుతోంది. ఇలా సంపాదించిన మొత్తంతో ఆశాజ్యోతి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆటిజం, ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆపన్న హస్తం అందిస్తోంది. వందలాది మంది ప్రత్యేక అవరాసరాలున్న పిల్లలకు వీల్ చైర్లు, వైద్య పరికరాలు అందిస్తూ.. చాలా మందికి ఐశ్వర్య ఆదర్శంగా నిలుస్తోంది. 


Updated Date - 2021-04-18T00:21:45+05:30 IST