బెజవాడకు కాసేపట్లో సీఎం... విరిగిపడ్డ కొండచరియలు

ABN , First Publish Date - 2020-10-21T20:51:22+05:30 IST

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీటలు వారి కొండ చరియలు విరిగిపడుతున్నాయి.

బెజవాడకు కాసేపట్లో సీఎం... విరిగిపడ్డ కొండచరియలు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీటలు వారి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఆరు నుంచి ఏడుగురు మృతి చెంది ఉండొచ్చని ఘటనా స్థలిలో ఉన్నవారు చెబుతున్నారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. కొండ చరియలు విరిగిపడటంపై మీడియా హెచ్చరించినా.. అధికారులు పట్టించుకోకుండా.. కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేశారు.  


మరికాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీఎం రాక కోసం మీడియా ప్రతినిధులు ఎదురు చూస్తున్న సమయంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. అంతకుముందే దుర్గ గుడి అధికారులను మీడియా ప్రతినిధులు హెచ్చరించారు. కొండ సగానికి సగం బీటలు వేసింది. ప్రమాదానికి ఆస్కారముందని తెలిపారు. అయితే దసరా తర్వాత చూస్తామని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. 

Updated Date - 2020-10-21T20:51:22+05:30 IST