Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంతృప్తితో వెళుతున్నా

సమర్ధవంతంగా పనిచేశా

సీపీ బత్తిన శ్రీనివాసులు


విజయవాడ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : విజయవాడలో రెండుసార్లు కమిషనర్‌గా పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు అన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన సహకారంతో సమర్ధవంతమైన సేవలు అందజేయగలిగానన్నారు. ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో సీపీ శ్రీనివాసులు శుక్రవారం పోలీసు కమిషనరేట్‌లో మీడియాతో మాట్లాడారు. నున్న పీఎస్‌లో పోలీసు శాఖ ఉద్యోగి మహేష్‌పై కాల్పులు, రాహుల్‌ హత్య, పెనమలూరు పీఎస్‌ పరిధిలోని హత్య కేసులను ఛేదించడంలో తమ సిబ్బంది ఎంతో కీలకంగా పనిచేశారన్నారు. ముఖ్యంగా దుర్గగుడిలో మూడు సింహాల చోరీ కేసును చాకచక్యంగా ఛేదించామన్నారు. ఉయ్యూరులో రూ.60లక్షల చోరీ కేసును కొద్దిరోజుల్లోనే కొలిక్కి తీసుకురాగా, వన్‌టౌన్‌ బంగారం షాపులో చోరీ కేసును, సిద్ధార్థనగర్‌లో వైద్యుడి ఇంట్లో దోపిడీ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించామని చెప్పారు. డబ్బుల కోసం వృద్ధులను హత్యలు చేసే ముఠాను అరెస్టు చేసి, 12 మంది వృద్ధులను కాపాడగలిగామని తెలిపారు.


Advertisement
Advertisement