వీఆర్‌ కోసం శ్రీనివాసరావు దరఖాస్తు చేయలేదు : సీపీ

ABN , First Publish Date - 2020-11-23T06:32:05+05:30 IST

వీఆర్‌ కోసం శ్రీనివాసరావు దరఖాస్తు చేయలేదు : సీపీ

వీఆర్‌ కోసం శ్రీనివాసరావు దరఖాస్తు చేయలేదు : సీపీ

విజయవాడ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తనకు వీఆర్‌ఎస్‌ ఇప్పించాలని సెల్ఫీ వీడియోలో సీఎంను కోరిన ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ టి.శ్రీనివాసరావు తమకు ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు చేయలేదని పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీనివాసరావు 2005 నుంచి డాగ్‌ స్క్వాడ్‌లో హ్యాండ్లర్‌గా పనిచేస్తున్నాడని, పదిహేనేళ్ల తర్వాత సాధారణ బదిలీల్లో భాగంగా అతడ్ని డాగ్‌ స్క్వాడ్‌ నుంచి సాయుధ రిజర్వు విధులు నిర్వర్తించడానికి బదిలీ చేశామని పేర్కొన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో కొంతకాలంగా సెలవులో ఉన్నాడని, స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ఎలాంటి దరఖాస్తు చేయలేదని స్పష్టం చేశారు. కుక్కల ఆరోగ్యానికి సంబంధించి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలన్నీ సత్యదూరమని కొట్టిపారేశారు. 

Updated Date - 2020-11-23T06:32:05+05:30 IST