దుర్గ మాయమ్మ!

ABN , First Publish Date - 2020-10-09T07:44:46+05:30 IST

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలోకి అడుగుపెట్టగానే రాజద్వారం పై భాగంలో ఈ పద్యం మెరుస్తూ కనిపిస్తుంది. ఇది దుర్గమ్మ అమ్మతనానికి అద్దం పట్టే పద్యం మాత్రమే కాదు, ఆ ఆలయంలో సమున్నతంగా నిలిచి - ఒక కవి భక్తికీ, కవిత్వ పటుత్వ సంపదకూ పట్టం కట్టిన పద్యం కూడా!...

దుర్గ మాయమ్మ!

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలోకి అడుగుపెట్టగానే రాజద్వారం పై భాగంలో ఈ పద్యం మెరుస్తూ కనిపిస్తుంది. ఇది దుర్గమ్మ అమ్మతనానికి అద్దం పట్టే పద్యం మాత్రమే కాదు, ఆ ఆలయంలో సమున్నతంగా నిలిచి - ఒక కవి భక్తికీ, కవిత్వ పటుత్వ సంపదకూ పట్టం కట్టిన పద్యం కూడా!


శ్రీమదాంధ్ర మహాభాగవత అవతారికను ‘శ్రీకైవల్య పదంబు జేరుటకునై...’ అంటూ ప్రారంభించి తొమ్మిది పద్యాల వరకూ సంస్కృత పద సమ్మిళితంగా వివిధ దేవతాస్తుతి చేసిన మహాకవి పోతన పదో పద్యానికి వచ్చేసరికి తనదైన సహజ ధోరణిలో ప్రవచించాడు. అందులో దుర్గమ్మను అలతి అలతి తెలుగు పదాలతో ఆయన అర్చించాడు. అమ్మ గురించి చెప్పడానికి ఆర్భాటాలు అక్కర్లేదు. అలాగే అమ్మను అడగడానికి పాండిత్య ప్రదర్శన కూడా అవసరం లేదు. అందుకే...


  • అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల 
  • బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, దన్నులో
  • నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
  • యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్‌... అన్నాడు.


అమ్మలందరికీ అమ్మ ఆమె. మూడు లోకాలకూ మూలం సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే ముగ్గురమ్మలు. ఆ ముగ్గురమ్మలకూ మూలమైన అమ్మ. అందరికన్నా ఉన్నతమైన అమ్మ. రాక్షసులను చంపి, దేవతల తల్లి దితి కడుపు శోకాన్ని తీర్చిన అమ్మ. తలచిన వారి మనసుల్లో, నమ్మిన వారికి సర్వ దేవతల్లో నిలిచి ఉండే అమ్మ. అటువంటి అమ్మ అయిన దుర్గమ్మ తనకు కవిత్వ పటిమను ప్రసాదించాలని పోతన ప్రార్థించాడు. 

లోకమంతటికీ అమ్మ అయిన దుర్గమ్మను స్తుతించే ఈ పద్యంలో శ్రీవిద్యా సారాన్ని పోతన నిక్షిప్తం చేశాడంటారు పండితులు. 


Updated Date - 2020-10-09T07:44:46+05:30 IST