ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-07T12:58:10+05:30 IST

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభం

విజయవాడ:  ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 7 నుండి 15 వరకు 9 రోజులు పాటు జరిగే నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కో విశేష అలంకారంలో  దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్లవ  నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం శుధ్ద పాడ్యమి  ప్రారంభయ్యే దసరా ఉత్సవాలు పదవరోజు దశమి నాడు  ముగుస్తాయి. ఈరోజు  ఉదయం సుప్రబాత సేవ, స్నపనాభిషేకం , బాల బోగ నివేదన , నిత్యార్ఛనాదికములు ముగిసిన అనంతరం  ఉత్సవాలకు అంకుకారర్ప చేయనున్నారు.  ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శన భాగ్యం  కలుగనుంది. తొలి రోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా  భక్తులకు దర్శనమిస్తారు.   స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఉన్న అమ్మవారిని గవర్నర్ విశ్వభూషణ్  హరిచందన్ మొదటి దర్శనం  చేసుకుంటారు. 9 గంటల నుండి దర్శనం అనుమతించడంతో క్యూలైన్ మార్గంలో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. 

Updated Date - 2021-10-07T12:58:10+05:30 IST