Abn logo
Sep 25 2021 @ 08:55AM

AP: జనసేన నేత కారుపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

విజయవాడ: జనసేన నాయకుడు కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త యడ్లపల్లి రామ్ సుధీర్ కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పెడన పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న హోటల్‌లో రామ్ సుధీర్ బస చేస్తుండగా.. బయట అగి ఉన్న కారు అద్దాలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో పగలకొట్టారు. రామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption