వచ్చేనెల 17నుంచి దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు

ABN , First Publish Date - 2020-09-24T15:52:08+05:30 IST

అక్టోబర్ 17 నుంచి కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

వచ్చేనెల 17నుంచి దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు

విజయవాడ: అక్టోబర్ 17 నుంచి కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు  దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ప్రకటనను విడుదల చేశారు. 17 నుండి 25 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. కరోనా దృష్ట్యా రోజుకి 10,000 మంది భక్తులకు మాత్రమే టైం స్లాట్ ప్రకారం దర్శనం ఉంటుందని తెలిపారు. రూ.300ల టికెట్స్‌పై 3000 మందిని, రూ.100 టికెట్స్‌పై 3000 మందిని, ఫ్రీ టోకెన్స్ పై 4000 మంది భక్తులకు ఉచిత దర్శనం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అలాగే మూల నక్షత్రం రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పించనున్నారు. ప్రత్యేక కుంకుమార్చన, చండీ హోమం, శ్రీ చక్ర నవావర్ణార్చన పూజలు పరోక్షంగా మాత్రేమే జరుగుతాయని అన్నారు. పూజా టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే విక్రయించడం జరుగుతుందని... సదరు పూజలు లైవ్ ద్వారా వీక్షించవచ్చని కార్యనిర్వాహణాధికారి వెల్లడించారు. దేవస్థాన వెబ్ సైట్ www.kanakadurgamma.org, mobile app kanakadurgamma ద్వారా టిక్కెట్లు పొందవచ్చని తెలిపారు. ముఖ్యంగా అమ్మవారి దర్శనార్ధం వచ్చే భక్తులందరూ కరోనా నియంత్రణ దృష్ట్యా మాస్క్ తప్పనిసరి ధరించి... అమ్మవారిని దర్శించి ఆమె కరుణా కటాక్షాలకు పాత్రులుకాగలరని కోరుతున్నామని  కార్యనిర్వాహణాధికారి పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-24T15:52:08+05:30 IST