జగన్‌కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదు..: మహిళలు

ABN , First Publish Date - 2022-04-23T19:45:38+05:30 IST

రాష్ట్రంలో ఆడపిల్లలకు మాన, ప్రాణ రక్షణ కల్పించలేని జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవిలో ఉండే అర్హత లేదని...

జగన్‌కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదు..: మహిళలు

విజయవాడ: రాష్ట్రంలో ఆడపిల్లలకు మాన, ప్రాణ రక్షణ కల్పించలేని జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవిలో ఉండే అర్హత లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతమంది ఆడవాళ్ల జీవితాలు నాశనం కావాలంటూ ప్రశ్నిస్తున్నారు. నిందితులకు శిక్షలు పడడంలేదు.. మరోవైపు బాధితులను పరామర్శించే తీరు కూడా ముఖ్యమంత్రికి లేదని విమర్శిస్తున్నారు. పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడంలో ఉన్నశ్రద్ధ.. నిందితులకు శిక్షలు వేయడంలో ఉంటే.. రాష్ట్రంలో అమానుష చర్యలు ఆగేవని అంటున్నారు.


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీకి రక్షణ లేకుండా పోయిందని మహిళలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా.. హత్యలు, అత్యాచారాలేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిశ చట్టం నుంచి ఒక్క నిందితుడికైనా శిక్ష పడి ఉంటే.. ఇలాంటి పనులు చేయడానికి భయపడతారని అన్నారు. దిశ చట్టం అసలు ఎక్కడుందని ప్రశ్నించారు. దిశ చట్టం ఒక బూటక చట్టమని పేర్కొన్నారు. గన్ను కంటే ముందు జగన్ ఉంటారని అన్నారు. మరి ఇవాళ విజయవాడలో ఈ ఘటన జరిగితే.. కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా సీఎం వెళ్లలేదని మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్న శ్రద్ధ ఇదేనా? అని ప్రశ్నించారు.

Updated Date - 2022-04-23T19:45:38+05:30 IST