Abn logo
Sep 21 2021 @ 09:59AM

వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేదు: ఫారూఖ్

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు దాడులకు తెగబడినా అరెస్టులు లేవన్నారు. అవమానాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. అక్బర్ భాషా ఉదతంలో మరోసారి జగన్ సర్కార్ మోసం చేసిందన్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులే మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని సివిల్ తగాదాలు సృష్టిస్తున్నారన్నారు.


న్యాయం జరగలేదనే ఆవేదనతో అక్బర్ భాషా కుటుంబంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. విశాఖలో ఓ పరిశ్రమలో చనిపోయిన వారికి జగన్ కోటి రూపాయలు ఇచ్చారని...మరి తమ పార్టీ నేతల దాష్టీకం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకోరా అని ప్రశ్నించారు. ముస్లిం, దళితుల ప్రాణాలంటే జగన్‌కు చిన్న చూపా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు కోటి నష్ట పరిహారం ఇవ్వాలని ఫారూఖ్ షుబ్లీ డిమాండ్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption