Abn logo
Aug 2 2021 @ 07:12AM

Vijayawada: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద..70 గేట్లు ఎత్తివేత

విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుంది. దీంతో బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు అప్రమత్తమై 70 గేట్లు ఎత్తి బ్యారేజీ నుంచి 11,920 క్యూసెక్కులు సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. అంతేకాకుండా కాలువలకు 6వేల క్యూసెక్కుల నీరును విడుదల చేశారు.  ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ ఫ్లో 52000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 45000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరక జారీ చేశారు.