బలవంతపు ఉపసంహరణపై ఎస్ఈసీ కొరడా

ABN , First Publish Date - 2021-03-03T17:07:46+05:30 IST

బలవంతపు ఉపసంహరణలకు వ్యతిరేకంగా ఎస్‌ఈసీ కొరడా ఝళిపించింది.

బలవంతపు ఉపసంహరణపై ఎస్ఈసీ కొరడా

విజయవాడ: బలవంతపు ఉపసంహరణలకు వ్యతిరేకంగా ఎస్‌ఈసీ కొరడా ఝళిపించింది. ఏపీ వ్యాప్తంగా మున్సిపోల్స్‌లో ఎక్కడికక్కడ బెదిరింపులతో బలవంతంగా ఉపసంహరణలు చేయిస్తున్నారని వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎస్ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియను తప్పనిసరిగా వీడియో ద్వారా రికార్డ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రూల్స్‌ను అతిక్రమించి బలవంతంగా ఉపసంహరణ చేయించినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఈసీ హెచ్చరించింది. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మార్చి 1 నుంచి మార్చి 31 వరకు సెలవులో ఉండటంతో అసిస్టెంట్ కమిషనర్‌కు ప్రొద్దుటూరు ఎలక్షన్ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-03-03T17:07:46+05:30 IST