Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 31 2021 @ 19:11PM

వికారాబాద్: ధాన్యం కొనుగోలులో గోల్‌మాల్

వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల మండలంలో ధాన్యం కొనుగోలులో గోల్‌మాల్ జరిగింది. రైతులకు ఇచ్చిన రశీదులు వేరు, కొనుగోలు నిర్వాహకుల వద్ద ఉన్న రశీదులు వేర్వేరుగా ఉన్నాయి. నాలుగు గ్రామాలకు చెందిన దాదాపు మూడువేల బస్తాల ధాన్యం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 300 వందల మంది రైతులను నిర్వాహకులు మోసం చేసారు. ఒక్కో రైతు నుంచి 9 నుంచి 10 బస్తాల ధాన్యం మాయం అయ్యాయి. దాదాపు 22 లక్షల రూపాయలను కొనుగోలు సెంటర్ నిర్వాహకులు అక్రమంగా మింగేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  

Advertisement
Advertisement