గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే కేసులో కీలక పరిణామాలు

ABN , First Publish Date - 2020-07-10T15:14:50+05:30 IST

కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ చేయడంతో ఆయన నేర సామ్రాజ్యానికి తెరపడినట్లయింది....

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే కేసులో కీలక పరిణామాలు

ముగిసిన దూబే క్రైం కథ

కాన్పూర్ (ఉత్తర్‌ప్రదేశ్): కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ చేయడంతో ఆయన నేర సామ్రాజ్యానికి తెరపడినట్లయింది. కాన్పూర్ ను గడగడలాడించిన గ్యాంగ్‌స్టర్ క్రైం కథ అతన్ని పోలీసులు మట్టుబెట్టడంతో ముగిసింది. 60 కేసులున్న వికాస్ దూబే ఈ నెల 3వతేదీన బిక్రూ గ్రామంలో 8మంది పోలీసులను హతమార్చిన ఘటనతో వార్తల్లోకి ఎక్కారు. పోలీసులను హతమార్చాక పారిపోయిన దూబే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి చేరారు. దూబే ఆచూకీ చెప్పిన వారికి రూ.5లక్షల రివార్డు ఇస్తామని యూపీ సర్కారు ప్రకటించింది. కాన్పూర్ ఎన్ కౌంటర్ పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో 81 మంది పేర్లున్నాయి. దూబేతో సంబంధాలున్న 68 మంది పోలీసులను సస్పెండ్, బదిలీలు చేశారు. గత వారం రోజుల్లో యూపీ పోలీసులు దూబే అనుచరులు ఐదుగురిని ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపారు. వికాస్ దూబే భార్య, కుమారుడితోపాటు మొత్తం 11 మంది అతని బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2020-07-10T15:14:50+05:30 IST