‘‘నేను వికాస్‌దూబేను...కాన్పూర్ వాలాను’’ అంటూ పోలీసుల ముందు అరుపులు

ABN , First Publish Date - 2020-07-09T17:05:07+05:30 IST

కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉజ్జయినిలో పోలీసులు అరెస్టు అనంతరం అతను ‘‘నేను వికాస్‌దూబేను...కాన్పూర్ వాలాను’’ అంటూ పోలీసుల ముందు పెద్దగా అరిచాడు.

‘‘నేను వికాస్‌దూబేను...కాన్పూర్ వాలాను’’ అంటూ పోలీసుల ముందు అరుపులు

ఉజ్జయిని (మధ్యప్రదేశ్): కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉజ్జయినిలో పోలీసులు అరెస్టు అనంతరం అతను ‘‘నేను వికాస్‌దూబేను...కాన్పూర్ వాలాను’’ అంటూ పోలీసుల ముందు పెద్దగా అరిచాడు. ఉజ్జయినిలోని మహంకాళీ ఆలయంలోకి వస్తుండగా అక్కడ ఉన్న ఆలయ సెక్యూరిటీ గార్డు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఉజ్జయిని పోలీసులు అతన్ని పట్టుకొని కారువద్దకు తీసుకువస్తుండగా వికాస్ దూబే నేను వికాస్ దూబేను...కాన్పూర్ వాడిని అంటూ పెద్దగా అరిచాడు. దీంతో పక్కనే ఉన్న పోలీసు అధికారి దూబే తలపై కొట్టి నిశ్శబ్దంగా ఉండాలని కోరాడు. వికాస్ దూబే ఉజ్జయిని మహంకాలీ దేవాలయంలో లొంగిపోవాలని అనుకున్నాడని యూపీ మాజీ డీజీపీ అరవిందకుమార్ జైన్ చెప్పారు. వికాస్ దూబే ప్రధాన అనుచరులు ముగ్గురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో  తనను కూడా చంపుతారనే భయంతోనే పోలీసుల ముందు లొంగిపోయేందుకు దూబే ఉజ్జయినికి వచ్చాడని జైన్ పేర్కొన్నారు. వికాస్ దూబేను అరెస్టు చేసిన ఉజ్జయిని పోలీసులను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేరస్థులను అసలు విడిచిపెట్టదని సీఎం నొక్కి చెప్పారు. దూబేతోపాటు మరో ఇద్దరు సన్నిహితులను కూడా అరెస్టు చేశామని మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా చెప్పారు. 

Updated Date - 2020-07-09T17:05:07+05:30 IST