Tokyo Olympics: బాక్సింగ్ రింగ్ నుంచి వికాశ్ కృష్ణన్ అవుట్

ABN , First Publish Date - 2021-07-25T00:01:45+05:30 IST

ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ వికాశ్ కృష్ణన్ కథ తొలి రౌండ్‌లోనే ముగిసింది.

Tokyo Olympics: బాక్సింగ్ రింగ్ నుంచి వికాశ్ కృష్ణన్ అవుట్

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ వికాశ్ కృష్ణన్ కథ తొలి రౌండ్‌లోనే ముగిసింది. జపాన్ బాక్సర్ ఒకజావా చేతిలో 5-0 తేడాతో ఓటమి పాలయ్యాడు. వికాశ్‌కు ఇది మూడో ఒలింపిక్. నిజానికి ఈసారి వికాశ్‌పై భారీ అంచనాలే ఉన్నా స్థానిక బాక్సర్ చేతిలో వికాశ్ మట్టికరిచాడు. మరోవైపు,  టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు చేదు అనుభవమే ఎదురైంది. శరత్ కమల్-మనికా బాత్రా జోడీ నిరాశ పరిచింది.

Updated Date - 2021-07-25T00:01:45+05:30 IST