విక్రమ్‌ సారాభాయ్‌ టీచర్‌ సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపికైన పవిత్ర

ABN , First Publish Date - 2022-01-20T06:16:49+05:30 IST

మండలంలోని గడ్డిపల్లి ఉన్నత పాఠశాల బయోలజీ ఉపాధ్యాయు రాలు మారం పవిత్రకు జాతీయ టీచర్‌ సైంటిస్ట్‌ అవా ర్డుకు ఎంపికయ్యారు.

విక్రమ్‌ సారాభాయ్‌ టీచర్‌ సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపికైన పవిత్ర

గరిడేపల్లి రూరల్‌, జనవరి 19: మండలంలోని గడ్డిపల్లి ఉన్నత పాఠశాల బయోలజీ ఉపాధ్యాయు రాలు మారం పవిత్రకు జాతీయ టీచర్‌ సైంటిస్ట్‌ అవా ర్డుకు ఎంపికయ్యారు. భారత ప్రభుత్వ సంస్థలైన విజ్ఞాన్‌ ప్రసార్‌ నెట్‌వర్క్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల సైన్స్‌, మాథ్స్‌ ఉపాధ్యాయులకు నిర్వహించిన విక్రమ్‌ సారాభాయ్‌ టీచర్‌ సైంటిస్ట్‌ జాతీయ అవార్డు-2021కు పవిత్ర మొదటి స్థానంలో నిలిచి దక్కించుకుంది. జూలై నుంచి మూడు దశల్లో నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఈ నెల 18న ప్రకటించగా, తాను మొదటి స్థానానికి ఎంపికైనట్లు పవిత్ర తెలిపారు. రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో ఉత్తరాఖండ్‌ ఉపాధ్యాయులు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీన నిర్వహించే సైన్స్‌డేలో అవార్డులు ప్రధానం చేస్తారని ఆమె తెలిపారు. జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైన పవిత్రను పలువురు అభినందించారు. 

Updated Date - 2022-01-20T06:16:49+05:30 IST