Apr 16 2021 @ 23:22PM

వెండితెరపైకి విక్రాంత్‌ రోణ

కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ ‘విక్రాంత్‌ రోణ’గా ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం ఫిక్సయింది. ఆయన కథానాయకుడుగా నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల మోషన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించిన చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. యాక్షన్‌ అడ్వంచర్‌గా తెరకెక్కుతున ్న ఈ చిత్రాన్ని కన్నడ సహా 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో విడుదలచేయనున్నారు. భారీ హంగులు, అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు అనుప్‌ భండారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


నీతా అశోక్‌ కథానాయిక. జాన్‌ మంజునాథ్‌, శాలినీ మంజునాథ్‌ నిర్మిస్తున్నారు. ‘‘విజువల్‌ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలివస్తారనే నమ్మకంతో, ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నాం’’ అని జాన్‌ మంజునాథ్‌ తెలిపారు. ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో విక్రాంత్‌ రోణ అనే సరికొత్త హీరోను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం’’ అని దర్శకుడు చెప్పారు.