గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లు కీలకం

ABN , First Publish Date - 2021-07-23T05:37:03+05:30 IST

గ్రామాభివృద్ధిలో అత్యంత కీలకపాత్ర పోషించడా నికి శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా అన్నారు.

గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లు కీలకం
సర్పంచ్‌ల శిక్షణలో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా

  • శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా

దివాన్‌చెరువు, జూలై 22: గ్రామాభివృద్ధిలో అత్యంత కీలకపాత్ర పోషించడా నికి శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా అన్నారు. ఆలమూరు, కపిలేశ్వరపురం, గంగవరం, మండలాలకు చెందిన గ్రామసర్పంచ్‌లకు మూడురోజులు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమాలను  సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా, ఆదికవి నన్నయ విశ్వవిద్యాల యం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు నన్నయ వర్శిటీలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్ర మం ద్వారా  సర్పంచ్‌లు విధులు, బాధ్యతలను పూర్తిగా ఆకళింపు చేసుకుని గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలన్నారు. గ్రామసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు భవన నిర్మాణాలు త్వరగా పూర్తిచేసేందుకు సర్పంచ్‌లు భాగస్వామ్యం వహిం చాలని కోరారు. గ్రామాభివృద్ధి, శ్రేయస్సు కోసం గ్రామసర్పంచ్‌లు పంచాయతీ నిధులు సక్రమంగా వెచ్చించాలని సూచించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రజల ఆరోగ్యభద్రతకు, ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామాల్లో హరిత విప్లవం దిశగా మొక్కలు విరి విగా నాటి సంరక్షించి పర్యావరణ సమతుల్యత కోసం పాటుపడాలని కోరారు. నన్నయ యూనివర్శిటీ వీసీ జగన్నాథరావు మాట్లాడుతూ పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం నూతన సర్పంచ్‌ల ద్వారా సాకారం కావాలని ఆకాంక్షించారు. సర్పంచ్‌లు గ్రామాభివృద్దిలో ఆదర్శ సర్పంచ్‌లుగా నిలవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీవో జానా సత్యనా రాయణ, డీడీవోలు కె.రత్నకుమారి, కె.భీమేశ్వర్‌, ఎంపీడీవోలు ఎన్వీవీవీఎస్‌ మూర్తి, బి.రామారావు. ఈవోపీఆర్డీ బొజ్జిరాజు, కార్యాలయ సూపరింటెండెంట్‌ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-23T05:37:03+05:30 IST