ఆలయాల పరిరక్షణలో గ్రామరక్షణ దళాలు కీలకం

ABN , First Publish Date - 2021-01-21T05:34:44+05:30 IST

ఆలయాల పరిరక్షణలో గ్రామరక్షణ దళాల పాత్ర కీలకమని ఎస్పీ అమిత్‌బర్దర్‌ తెలిపారు.

ఆలయాల పరిరక్షణలో గ్రామరక్షణ దళాలు కీలకం

 మతశాంతి కమిటీలు ఏర్పాటుచేయాలి

 ఎస్పీ అమిత్‌బర్దర్‌ 


 శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 20 : ఆలయాల పరిరక్షణలో గ్రామరక్షణ దళాల పాత్ర కీలకమని ఎస్పీ అమిత్‌బర్దర్‌ తెలిపారు. బుధవారం రాత్రి జిల్లాలో ఆలయాల భద్రతతోపాటు పలు అంశాలపై జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని పోలీసుస్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు, మహిళా కార్యదర్శు లతో ఎస్పీ సమీక్షించారు. ప్రతి గ్రామంలో ఆలయాలు, మత ప్రార్థన మంది రాలు పరిరక్షణ కోసం గ్రామస్థాయిలో మతశాంతి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ముందస్తుగా  సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఎక్కడా అసత్యప్రచా రాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీలు విఠలేశ్వర్‌, శ్రీనివాసరావు  పాల్గొన్నారు. 

ఇచ్ఛాపురం రూరల్‌: ఆలయాల పరిరక్షణ బాధ్యత ఆయా గ్రామస్థులదేనని రూరల్‌ ఎస్‌ఐ కె.లక్ష్మి తెలి పారు. బుధవారం   డొంకూరు, బూర్జపాడు, సన్యాసిపుట్టుగ, ఈదుపురం, కొఠారి తదితర గ్రామాల్లోని ఆలయాలను సందర్శించారు. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భామిని: ఆలయాల్లోని విగ్రహాలపై దాడులు జరుగుతున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అమిత్‌బ ర్దర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసులకు ఆదేశించారు. బుధవారం బత్తిలి పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ కేవీ  సురేష్‌  స్టేషన్‌ఆవరణలో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్‌లో సచివాలయ మహిళా పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు, వలంటీర్లు  పాల్గొన్నారు.  ఆమదాలవలస: ఆలయాలకు రక్షణ కల్పిస్తామని సీఐ  బి.ప్రసాదరావు తెలిపారు. బుధవారం స్దానిక పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, సచివాలయ వెల్పేర్‌ అసిస్టెంట్లతో  ఎస్పీ నిర్వహించిన జూమ్‌ వీడియోకాన్పరెన్స్‌లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనల మేరకు సర్కిల్‌ పరిదిలో  ఆలయాలు, మసీదులు, ప్రార్థనా స్థలాల వివరాలును సేకరించామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ కోటేశ్వరరావు, కమిటీ సభ్యులు డి.చిరంజీవి కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. లావేరు: దేవాల యాల భద్రత అందరి బాధ్యతని ఎస్పీ అమిత్‌బర్దర్‌ అన్నారు. బుధవారం లావేరు పోలీస్‌ స్టేషన్‌లో  మండలంలోని వివిధ గ్రామాల దేవాలయాల కమిటీలతో ఎస్పీ  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆలయాలపై జరుగు తున్న దాడులను అరికట్టేందుకు కమిటీలతో పాటు గ్రామ ప్రజలు  అప్రమ త్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, తదితరు లు పాల్గొన్నారు. రణస్థలం: ఆలయాల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేసినట్లు జేఆర్‌పురం సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ వాసునారాయణ తెలిపారు. 30 పంచాయతీల పరిధిలోని గ్రామస్థులు, యువకులను ఈ కమిటీల్లో భాగస్వామ్యం చేశారు. 

మతసామరస్య సంఘటనలపై స్పందించాలి

గుజరాతీపేట: జిల్లాలో ఎటువంటి మతసామరస్య సంఘటనలకు తావులేకుండా తక్షణమే స్పందించాలని కలెక్టర్‌ నివాస్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌  మాట్లాడారు. జిల్లాలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై పోలీసు శాఖ తక్షణమే స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. సంతబొమ్మాళిలో జరిగిన సంఘటనలో 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయడం  అభిందనీయమన్నారు.



Updated Date - 2021-01-21T05:34:44+05:30 IST