Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంచాయతీ నిధులు ఏవీ..?

మండల సమావేశంలో నిలదీసిన ప్రజాప్రతినిధులు


బుట్టాయగూడెం, నవంబరు 30: పంచాయతీ నిధులు ఏవీ..? ప్రభుత్వం తీసేసుకుంటే ఎలా..? అంటూ మండల పరిషత్‌ సమావేశంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ధ్వజమెత్తారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి తీసు కుంటున్న చర్యలేమిటని పలువురు ప్రజాప్రతినిధులు ఆయా శాఖల అధి కారులను నిలదీశారు. ఎంపీపీ కారం శాంతి అధ్యక్షతన మంగళవారం జరి గిన మండల పరిషత్‌ సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సమక్షంలో పలువురు సర్పంచ్‌లు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.


చాలాకాలంగా గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్‌, మంచినీరు, పారిశుధ్య సమస్యలు ప్రజలను ఇబ్బందులు పెడుతన్నాయని, అనేక సందర్భాల్లో అధి కారుల దృష్టికి తెచ్చినా ఆ సమస్యలు పరిష్కారం కాలేదని పలువురు సర్పం చ్‌లు సమావేశం దృష్టికి తెచ్చారు. పంచాయతీల అభివృద్ధికి విడుదల చేసిన నిధులను కూడా ప్రభుత్వం తీసుకుంటే గ్రామాభివృద్ధి ఎలా చేయాలని నిల దీశారు. ఏజెన్సీ ప్రాంతంలో పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులే ప్రధా నమని వాటిని ప్రభుత్వం తీసుకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతా యని ప్రశ్నించారు. మండల పరిషత్‌ పాలకవర్గం ఎన్నికైన తర్వాత మొదటి సమావేశం కావడంతో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు సమస్యలపై తమ గళాన్ని గట్టిగానే వినిపించారు. అధికార పార్టీకి చెందిన సభ్యులు కూడా సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయడం విశేషం. పలు శాఖల పనితీరుపై ప్రజాప్రతినిధులు ప్రశ్నలు అడగ్గా అఽధికారులు సమాధా నాలు ఇచ్చారు. అధికారుల పనితీరు మెరుగుపడాలని, సమష్టిగా మండల అభివృద్ధికి కృషిచేయాలని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మొడియం రామతులసి, ఎంపీడీవో ఎం.రాజు, తహసీల్దార్‌ వైవి.లక్ష్మీకుమారి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement