Abn logo
Aug 5 2020 @ 09:58AM

ధ‌నుష్ కోసం విలేజ్‌ సెట్టింగ్‌

యువనటుడు ధనుష్‌ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘కర్ణన్‌’. ఈ చిత్రం కోసం తిరునల్వేలి సమీపంలోని ఓ మైదానంలో అందమైన గ్రామాన్ని సెట్‌ వేసి రూపొందించారు. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లాల్‌, రాజీషా విజయ్‌, యోగిబాబు, గౌరీకిషన్‌, లరక్ష్మీపియ తదితరులు నటిస్తున్నారు. ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం తిరునల్వేలి సమీపంలో నిర్మించిన విలేజ్‌ సెట్టింగ్‌ వీడియోను ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ సెట్టింగ్‌ను చూసిన నెటిజన్లు విస్మయం చెందారు. పచ్చటి వాతావరణంలో సెట్టింగ్‌తో రూపొందించిన ఆ అందమైన గ్రామం సహజసిద్ధంగా ఉందని మెచ్చుకున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ 90 శాతం పూర్తయ్యిందని, మిగిలిన పది శాతం లాక్‌డౌన్‌ పూర్తిగా తొలగించిన వెంటనే ప్రారంభమవుతుందని దర్శకుడు మారి సెల్వరాజ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement