చెట్టు తొలగింపుపై గ్రామస్థుల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-04-21T05:13:19+05:30 IST

మండల కేంద్రంలోని చౌరస్తాలో నీడనిచ్చే వేపచెట్టు తొలగింపుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చెట్టు తొలగింపుపై గ్రామస్థుల ఆగ్రహం

మద్దూరు, ఏప్రిల్‌ 20: మండల కేంద్రంలోని చౌరస్తాలో నీడనిచ్చే వేపచెట్టు తొలగింపుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెట్ల పెంపకాన్ని ఉద్యమంలా చేపడితే గ్రామపంచాయతీ తీర్మానం మేరకు చెట్లను తొలగించడం శోచనీయమన్నారు. వేపచెట్టు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సర్పంచ్‌ కంఠారెడ్డి జనార్ధన్‌రెడ్డి మాట్లాడారు. 100 ఏళ్లకు పైగా ఉన్న వేపచెట్టు ప్రమాదకరంగా మారిందని, గ్రామస్థులు, గ్రామపంచాయతీ తీర్మానం మేరకే తొలగించినట్లు తెలిపారు. 


Updated Date - 2021-04-21T05:13:19+05:30 IST