ప్రియుడే కావాలంటూ నలుగురు పిల్లల తల్లి పెట్టిన గ్రామ పంచాయితీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-04T12:28:25+05:30 IST

మనిషి బ్రతకడానికి సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాగరికత నేర్చుకొని తనకంటూ కొన్ని విలువలు, పద్ధతులు పెట్టుకున్నాడు. ఆ విలువలు, పద్ధతులు లేకుండా జీవిస్తే జంతువులకూ మనిషికి తేడా ఉండదు. గౌరవంగా సమాజంలో బ్రతకాలంటే కొన్ని విలువలు పాటించాల్సిందే.. అలా కాకుండా ఒక వ్యక్తి విచ్చలవిడితనంగా ఉంటానంటే సమాజం ఒప్పుకోదు. మరీ ముఖ్యంగా మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి ఈ పద్ధతులకు కట్టుబడి ఉండాల్సిందే లేకపోతే ఏం జరుగుతుందో.. ఒక తాజా ఘటన ఉదాహరణ...

ప్రియుడే కావాలంటూ నలుగురు పిల్లల తల్లి పెట్టిన గ్రామ పంచాయితీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

మనిషి బ్రతకడానికి సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాగరికత నేర్చుకొని తనకంటూ కొన్ని విలువలు, పద్ధతులు పెట్టుకున్నాడు. ఆ విలువలు, పద్ధతులు లేకుండా జీవిస్తే జంతువులకూ మనిషికి తేడా ఉండదు. గౌరవంగా సమాజంలో బ్రతకాలంటే కొన్ని విలువలు పాటించాల్సిందే.. అలా కాకుండా ఒక వ్యక్తి విచ్చలవిడితనంగా ఉంటానంటే సమాజం ఒప్పుకోదు. మరీ ముఖ్యంగా మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి ఈ పద్ధతులకు కట్టుబడి ఉండాల్సిందే లేకపోతే ఏం జరుగుతుందో.. ఒక తాజా ఘటన ఉదాహరణ.


ఝార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ నగర పరిధిలో గొవింద్‌పూర్ అనే గ్రామం ఉంది. అక్కడ రుక్సానా అనే మహిళ తన నలుగురు పిల్లలు, అత్తమామలతో కలిసి ఉంటోంది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా తమిళనాడులో ఉన్నాడు. ఒక రోజు రుక్సానాకు ఆరోగ్యం బాగోలేదని అస్పత్రికి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రుక్సానా అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ తెలిసిన బంధువులందరికీ రుక్సానాను వెతకమని కబురు చేశారు. అలా కొన్ని రోజుల తరువాత ఒక వ్యక్తి రుక్సానా ఆచూకీ దొరికిందని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. 


రుక్సానా ధన్‌బాద్ నగరంలో ఉందని తెలిసింది. ఆమె రెహ్మాన్ అనే వ్యక్తితో కలిసి ఉంటోందని కూడా ఆ వ్యక్తి చెప్పాడు. రెహ్మాన్ మరెవరో కాదు, అదే గోవింద్‌పూర్ గ్రామానికే చెందినవాడు. రుక్సానా అత్తమామలు ఆమెను, రెహ్మాన్‌ని బలవంతంగా గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామ పెద్దల ముందు పంచాయితీ పెట్టారు. రుక్సానా భర్త కూడా అక్కడికి వచ్చాడు. నలుగురు పిల్లలు ఉండడంతో ఆమెను తిరిగి ఇంటికి రమ్మని కోరాడు, కానీ రుక్సానా అందరి ముందూ తనకు తన ప్రియుడే కావాలని చెప్పింది. రెహ్మాన్‌తోనే కలిసి జీవిస్తానని స్పష్టంగా మాట్లాడింది. దీంతో ఆ గ్రామ ప్రజలు రుక్సానాపై దాడి చేశారు. రుక్సానాతో రెహ్మాన్‌ని కూడా చితకబాదారు. వారిని కాపాడడానికి రెహ్మాన్ తల్లిదండ్రులు అడ్డు వచ్చారు. ఆ సమయంలో కోపంలో ఉన్న గ్రామస్తులు రెహ్మాన్ తండ్రిని కూడా వదల్లేదు. చివరికి గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగప్రవేశం చేశారు.


అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ దాడిలో రెహ్మాన్, అతని తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు దాడి చేసిన వారిలో కొంతమందిని గుర్తించి వారిని అరెస్టు చేశారు. అక్కడ జరిగిన ఘటన గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-11-04T12:28:25+05:30 IST