వేబిల్లులు లేని ఇసుక లారీలను పట్టుకున్న గ్రామస్థులు

ABN , First Publish Date - 2021-06-14T05:06:40+05:30 IST

ఇసుక క్వారీల నుంచి వే బిల్లులు లేకుండా శనివా రం రాత్రి అక్రమంగా వెళ్తున్న ఏడు ఇసుక లా రీలను ఖద్గాం గ్రామస్థు లు పట్టుకున్నారు.

వేబిల్లులు లేని ఇసుక లారీలను పట్టుకున్న గ్రామస్థులు
పోలీసుస్టేషన్‌కు తరలించిన ఇసుక లారీలు

బిచ్కుంద, జూన్‌ 13: ఇసుక క్వారీల నుంచి వే బిల్లులు లేకుండా శనివా రం రాత్రి అక్రమంగా వెళ్తున్న ఏడు ఇసుక లా రీలను ఖద్గాం గ్రామస్థు లు పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఒకటవ నెం బర్‌ ఇసుక పాయింట్‌ నుం చి రాత్రి వేళల్లో ప్రతిరోజూ ముప్పై, నలబై లారీలు వే బిల్లులు లేకుండానే నిర్వాహకులు భారీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పగటిపూట వేబిల్లులు ఉన్న ప్రతీ ఇసుక లారీలో అదనంగా పది టన్నుల వరకు ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇసుక క్వారీల వైపు అఽధికారులు దృష్టి సారించకపోవడంతో క్వారీ ల నిర్వాహకులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. 20కి పైగా వేబిల్లులు లేని ఇసుక లారీలను అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇస్తే అన్నింటికీ వేబి ల్లులు ఉన్నాయని ఏడు లారీలను పోలీసుస్టేషన్‌కు తరలించారని తెలిపా రు. పట్టుబడిన ఇసుక లారీలపై కేసుల నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాయ న్న తెలిపారు.

Updated Date - 2021-06-14T05:06:40+05:30 IST