వినుకొండ రూరల్ సీఐ సస్పెండ్

ABN , First Publish Date - 2022-01-13T02:47:02+05:30 IST

జిల్లాలోని వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్‌ను

వినుకొండ రూరల్ సీఐ సస్పెండ్

గుంటూరు: జిల్లాలోని వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. శావల్యాపురం మండలానికి చెందిన రైతు నరేంద్రపై సీఐ కేసు పెట్టి రిమాండ్‌కు పంపారు. రైతు నరేంద్రపై చెప్పుతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కొట్టబోయాడు. అయితే తిరిగి నరేంద్ర పైనే ఎమ్మెల్యే పీఏ తప్పుడు ఫిర్యాదు చేశారు. నరేంద్రపై తప్పుడు కేసు పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆరోపణల నేపథ్యంలో అడిషనల్ ఎస్పీతో అధికారులు విచారణ జరిపించారు. నరేంద్రపై తప్పుడు కేసులు పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో వినుకొండ రూరల్ సీఐపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. 


Updated Date - 2022-01-13T02:47:02+05:30 IST