Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 15 2022 @ 03:46AM

నిబంధనలు అతిక్రమిస్తే సహించం

104 ట్రావెల్‌ బస్సులపై చర్యలు: ఎంఆర్‌ఎం రావు 

హైదరాబాద్‌, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ బస్సు యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని రవాణా శాఖ కమిషనర్‌ ఎం ఆర్‌ఎంరావు హెచ్చరించారు. అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించటం, అధికచార్జీలు వసూలు చేయడం, కమర్షియల్‌ లగేజీ తీసుకువెళ్లడం రవాణా నిబంధనలను అతిక్రమించడమేనని ఆయన స్పష్టం చేశారు. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బస్సులను తనిఖీ చేస్తున్నట్టు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన 104 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై చర్యలు తీసుకున్నట్టు వివరించారు. 

Advertisement
Advertisement