పీఓకే అసెంబ్లీ ఎన్నికల్లో చెలరేగిన హింస... ఇద్దరు మృతి!

ABN , First Publish Date - 2021-07-26T12:50:22+05:30 IST

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో...

పీఓకే అసెంబ్లీ ఎన్నికల్లో చెలరేగిన హింస... ఇద్దరు మృతి!

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు హతమయ్యారు. పీఓకేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్తాన్ తహరీఫ్-ఏ- ఇన్సాఫ్(పీటీఐ) పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) మధ్య పోటీ జరిగింది. ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు పీఎంఎల్-ఎన్, పీపీఈకి చెందిన ఒక్కొక్క అభ్యర్థి విజయం సాధించారు. దీనికి ముందు కోటలీ జిల్లాలోని చార్హోయీ ప్రాంతంలోగల ఒక ఎన్నికల కేంద్రంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పీటీఐ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు తుపాకీ తూటాలకు బలయ్యారు. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. 

Updated Date - 2021-07-26T12:50:22+05:30 IST