తక్షణమే అమిత్‌ షా రాజీనామ చేయాలి

ABN , First Publish Date - 2020-02-28T11:14:13+05:30 IST

ఢిల్లీ లో జరుగుతున్న హింసాకాండకు నైతి క బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తక్షణమే తన పద వికి రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్‌ డిమాం డ్‌ చేశారు.

తక్షణమే అమిత్‌ షా రాజీనామ చేయాలి

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సహయ కార్యదర్శి సురేష్‌


వనపర్తి టౌన్‌, ఫిబ్రవరి 27: ఢిల్లీ లో జరుగుతున్న హింసాకాండకు నైతి క బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తక్షణమే తన పద వికి రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్‌ డిమాం డ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కా ర్యాలయంలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) గురువారం  జి ల్లా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా మార్చి 15 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో జరిగే మహాసభల గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సమా వేశానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశం లో మతహింస పెట్రేగిపోతుందన్నారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొ డుతూ, భారత రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక వా దులు, ప్రశ్నించే గొంతుకలపై పోలీసు లతో ఉక్కు పాదం మోపి  అణిచి వేస్తు న్నారని విమర్శించారు.  ఇటు రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితా లకు గుదిబండలా మారిందన్నారు.  బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌లకు, రాష్ట్ర కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సంతోష్‌, నాయకులు కుతూబ్‌, మహే ష్‌, శరత్‌, అనిల్‌, భరత్‌, రాజు, రాజ శేఖర్‌రెడ్డి, శేఖర్‌, ధర్మేంద్ర, భాస్కర్‌ తది తరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-28T11:14:13+05:30 IST