Abn logo
Jan 10 2021 @ 02:31AM

ప్రాణం తీసిన హింసాత్మక శృంగారం

 ప్రియుడి మెడ చుట్టూ తాడు బిగుసుకుపోవడంతో మృతి

 ప్రేయసి అరెస్టు.. మహారాష్ట్రలో ఘటన


నాగపూర్‌, జనవరి 9: హింసాత్మక శృంగారంతో ఆనందపుటంచులను తాకాలనే ఆ ప్రేయసీప్రియుల తప న ప్రియుడి ప్రాణాలనే తీసింది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఓ 30 ఏళ్ల వ్యక్తికి, పెళ్లయి ఒక బిడ్డ కూడా ఉన్న మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. శుక్రవారం ఇద్దరూ ఓ లాడ్జిలో దిగారు.

భాగస్వామిని బానిసగా మార్చి హింసించే రతిక్రీడ బీడీఎ్‌సఎమ్‌ (బాండేజ్‌ అండ్‌ డిసిప్లిన్‌-డామినెన్స్‌ సబ్మిషన్‌ సెడోమేసోకిజమ్‌)కు ఉపక్రమించారు. గదిలోని ఓ కుర్చీలో ప్రియుడిని కూర్చోబెట్టి, అతడి కాళ్లు, చేతులను నైలాన్‌ తాడుతో కట్టేసిన మహిళ.. అనంతరం శృంగారంలో భాగంగా అతడి మెడ చుట్టూ కూడా తాడును వేసింది.


కొద్దిసేపటికి తర్వాత ఆ మహిళ వాష్‌రూంకు వెళ్లగా అతడు కుర్చీలోంచి జారి కిందపడ్డాడు. ఈ క్రమంలో మెడ చుట్టూ ఉన్న తాడు గొంతుకు గట్టిగా బిగుసుకుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. వాష్‌రూం నుంచి వచ్చి చూసేసిరికి విగతజీవిగా పడివున్న  ప్రియుడిని చూసి ఆమె షాక్‌కుగురైంది. ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  


Advertisement
Advertisement