Metro stationలో యువతి డ్యాన్స్‌

ABN , First Publish Date - 2022-07-21T14:13:19+05:30 IST

నగరంలోని మెట్రోస్టేషన్‌లో యువతి డ్యాన్స్‌తో సందడి చేసింది. ఉదయం పూట రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చిన ఆమె ‘విక్రాంత్‌ రోణా’ సినిమాలోని..

Metro stationలో యువతి డ్యాన్స్‌

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

కౌన్సెలింగ్‌ ఇస్తామన్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ: నగరంలోని మెట్రోస్టేషన్‌లో యువతి డ్యాన్స్‌తో సందడి చేసింది. ఉదయం పూట రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చిన ఆమె ‘విక్రాంత్‌ రోణా’ సినిమాలోని ‘‘రారా.. రక్కమ్మా.. రారా రక్కమ్మా’’ అనే చరణానికి సరదాగా రీల్‌ చేసి ప్రయాణికులను ఆకర్షించింది. ప్లాట్‌ఫాం-2 పక్కన సినిమాలోని స్టెప్పులు వేసి స్నేహితురాలితో వీడియో తీయించుకుంది. దానిని సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. కారిడార్‌-3లోని దుర్గం చెరువు స్టేషన్‌లో ఆమె డ్యాన్స్‌ చేసిన వీడియో వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. వీడియోను చూసిన చాలామంది లైక్‌లు, షేర్లు చేశారు. దీన్ని మెట్రో అధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు. స్టేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా డ్యాన్స్‌ చేయడం సరికాదని, యువతిని పిలిపించి మరోమారు ఇలా చేయకుండా కౌన్సెలింగ్‌ ఇస్తామని తెలిపారు.

Updated Date - 2022-07-21T14:13:19+05:30 IST