Abn logo
Apr 3 2021 @ 10:46AM

ఈ కాకిని చూసి సిగ్గుపడాలి!

సామాజిక బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్న మానవ జాతిని సిగ్గు పడేలా చేసింది ఓ కాకి. డస్ట్ బిన్ అందుబాటులోనే ఉన్నా బయటే చెత్త విసిరేసే అలవాటున్న వారికి బుద్ధి చెప్పింది. బయట ఉన్న చెత్తను ఒక్కొక్కటిగా డస్ట్ బిన్‌లో వేస్తూ అక్కడ ఉన్న మనుషులు సిగ్గు పడేలా చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   

ఖాళీ డబ్బాలను, కాగితం ముక్కలను పక్కనే ఉన్న డస్ట్ బిన్‌లో వేసి ఆ ప్రాంతం మొత్తాన్ని ఓ కాకి శుభ్రం చేసింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన సుశాంత నందా అనే వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. `మనుషులు ఎప్పుడో సిగ్గును మర్చిపోయారని కాకికి తెలుసు` అంటూ ఆయన ఈ వీడియోకు క్యాప్షన్ కూడా జోడించారు. వీడియాలో కాకి ప్రవర్తనపై ఎందరో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement