Viral Video: ఎన్ని గుండెలు నాయనా నీకు.. నాగుపాముకు స్నానం చేయిస్తున్నాడు..!

ABN , First Publish Date - 2021-10-07T23:18:39+05:30 IST

పాము కనిపిస్తే చాలు.. ప్రతి ఒక్కరూ పరుగు లంకించుకుని ఆమడ దూరం వెళ్లి వెనక్కి చూస్తారు. అలాంటిది ఓ పెద్ద నాగుపాముకు స్నానం చేయించాలంటే ఒక్క గుండె సరిపోతుందా..? మరి ఆ వ్యక్తికి ఎన్ని గుండెలుంటే అంత ధైర్యం ఉండి ఉంటుంది

Viral Video: ఎన్ని గుండెలు నాయనా నీకు.. నాగుపాముకు స్నానం చేయిస్తున్నాడు..!

ఇంటర్‌నెట్ డెస్క్: పాము కనిపిస్తే చాలు.. ప్రతి ఒక్కరూ పరుగు లంకించుకుని ఆమడ దూరం వెళ్లి వెనక్కి చూస్తారు. అలాంటిది ఓ పెద్ద నాగుపాముకు స్నానం చేయించాలంటే ఒక్క గుండె సరిపోతుందా..? మరి ఆ వ్యక్తికి ఎన్ని గుండెలుంటే అంత ధైర్యం ఉండి ఉంటుంది. పాముకు స్నానం ఏంటని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.. ఓ వ్యక్తి పెద్ద నాగుపాముకు స్నానం చేయించి, దాని దాహం తీర్చి అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. 


కొద్దిసేపు నిడివి గల ఈ వీడియోను helicopter_yatra అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేశాడు. వాతావరణం బాగా వేడిగా ఉండడం వల్ల పాము నీళ్ల కోసం వెతుకుతూ ఓ కాలనీలోకి వెళ్లింది. కానీ అంత పెద్ద పామును చూసి జనాలందరూ వామ్మో అని భయంతో ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఆ నాగుపాము బాధను అర్థం చేసుకుని అక్కడే బకెట్లో ఉన్ననీటితో దానికి స్నానం చేయించాడు. అతడు నీళ్లు పోస్తున్నపుడు పాము అతడిని కాటేసే ప్రయత్నం కూడా చేయకపోవడాన్ని పై వీడియోలో మనం చూడవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు అతడి మంచి మనసును మెచ్చుకుంటున్నారు. కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోస్ట్ చేసినప్పటినుంచి ఈ వీడియోను 33లక్షల మంది లైక్ చేశారు. 

Updated Date - 2021-10-07T23:18:39+05:30 IST