వైరల్ వీడియో: స్పీడ్‌గా వెళ్తున్న కారు.. బానెట్‌పై నుంచి అద్దం మీదకు పాకుతున్న పాము.. షాకవుతున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2021-10-02T22:00:37+05:30 IST

స్పీడుగా వెళ్తున్న కారు బానెట్‌పై ఓ పెద్ద పాము పడింది. ఎక్కడినుంచి వచ్చిందో ఏమో కానీ లోపల కూర్చున్న వారిని, వీడియో చూసిన నెటిజన్లను భయాందోళనకు గురి చేసింది. 20సెకన్ల నిడివి గల ఆ వీడియో ఒళ్లు గగుర్పొడిచే

వైరల్ వీడియో: స్పీడ్‌గా వెళ్తున్న కారు.. బానెట్‌పై నుంచి అద్దం మీదకు పాకుతున్న పాము.. షాకవుతున్న నెటిజన్లు!

ఇంటర్‌‌నెట్ డెస్క్: స్పీడుగా వెళ్తున్న కారు బానెట్‌పై ఓ పెద్ద పాము పడింది. ఎక్కడినుంచి వచ్చిందో ఏమో కానీ లోపల కూర్చున్న వారిని, వీడియో చూసిన నెటిజన్లను భయాందోళనకు గురి చేసింది. 20సెకన్ల నిడివి గల ఆ వీడియో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది. పాము బానెట్‌పై నుంచి అద్దం మీదకు పాకుతుండగా..అది గమనించిన డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపాడు.


అపుడు పాము అద్దంపై నుంచి పాకుతూ పైకి వెళ్లింది. దీన్ని కారు లోపల కూర్చున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎక్కడ జరిగిందన్న వివరాలు అయితే లభ్యమవలేదు కానీ.. ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 4వేల వ్యూస్ దక్కించుకుంది. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2021-10-02T22:00:37+05:30 IST