Viral video: భారీ అగ్ని ప్రమాదంలో అక్కాతమ్ముళ్ల సాహసం.. 4 అంత‌స్తుల‌పై నుంచి కిందకు దూకడానికి వారు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2021-12-20T06:37:39+05:30 IST

సోష‌ల్ మీడియాలో ఒళ్లు గ‌గ్గురుపొడిచే ఒక వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక బిల్డింగ్‌లోని ఒక ఫ్లాట్‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించగా.. ఒక 18 ఏళ్ల యువ‌తి త‌న త‌మ్ముడితో సహా నాలుగో అంత‌స్తు నుంచి కిందికి దూకింది...

Viral video: భారీ అగ్ని ప్రమాదంలో అక్కాతమ్ముళ్ల సాహసం.. 4 అంత‌స్తుల‌పై నుంచి కిందకు దూకడానికి వారు ఏం చేశారంటే..

సోష‌ల్ మీడియాలో ఒళ్లు గ‌గ్గురుపొడిచే ఒక వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక బిల్డింగ్‌లోని ఒక ఫ్లాట్‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించగా.. ఒక 18 ఏళ్ల యువ‌తి త‌న త‌మ్ముడితో సహా నాలుగో అంత‌స్తు నుంచి కిందికి దూకింది. ఇద్ద‌రూ స్వ‌ల్ప గాయాలయ్యాయి. కానీ వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఘ‌ట‌న అమెరికాలోని న్యూయార్క్‌ న‌గ‌రంలో జ‌రిగింది.


న్యూయార్క్‌లోని మాన్‌హాట‌న్ స‌మీపంలో ఒక 14 అంత‌స్తుల బిల్డింగ్‌లో నాలుగో అంత‌స్తులో గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కు భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఒక ఎలెక్ట్రిక్ బైక్‌లోని లిథియ‌మ్ ఐయాన్ బ్యాట‌రీ పేల‌డంతో ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింద‌ని మాన్‌హాట‌న్ అగ్నిమాప‌క సిబ్బంది తెలిపింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఒక వృద్ధుడు చనిపోగా.. ఇద్దరు టీనేజర్లు (అమ్మాయి 18, అబ్బాయి 13) ఇరుక్కుపోయారు. వారిద్దరూ అక్కాతమ్ముళ్లు.

 

ప్రాణాలు కాపాడుకోవ‌డానికి ఆ టీనేజ‌ర్ల‌ిద్దరూ చాలా సమయస్ఫూర్తితో ధైర్యం కోల్పోకుండా వ్యవహరించారు. భారీ అగ్ని జ్వాల‌లు ఎగిసి ప‌డుతుండగా.. ఇద్దరిలో ఒక‌రైన‌ ఆ 18 ఏళ్ల అమ్మాయి నాలుగో అంతస్తులో కిటికీ నుంచి బ‌య‌ట‌కు వచ్చి వేలాడుతూ ప‌క్క‌నే ఉన్న నీటి పైపుల‌ను అందుకుంది. ఆ తరువాత త‌న త‌మ్ముడిని కూడా ఆ పైపుల వ‌ద్ద‌కు లాగి ముందు అత‌డిని పైపుల స‌హాయంతో కింద‌కు పంపింది. ఆ త‌రువాత త‌ను కూడా చివ‌రి నిమిషంలో పైపులను ప‌ట్టుకొని జారుకుంటూ వ‌చ్చి కింద ప‌డింది. ఈ ఘ‌ట‌న‌ని ఒక మీడియా రిపోర్ట‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. ఇప్పుడ‌ది తెగ వైర‌ల్ అవుతోంది.


ఎలెక్‌ట్రిక్ వాహనాల ఉపయోగించే లిథియ‌మ్ ఐయాన్ బ్యాట‌రీ వల్ల అగ్ని ప్ర‌మాద దుర్ఘ‌ట‌న‌లు గ‌త కొద్ది కాలంగా ఎక్కువ కావ‌డంతో.. అమెరికా ప్రభుత్వం ఆ బ్యాట‌రీల‌ను సుర‌క్షిత ప్ర‌దేశాల‌లో మాత్ర‌మే ఛార్జింగ్ చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచనలు చేసింది.

Updated Date - 2021-12-20T06:37:39+05:30 IST