Advertisement
Advertisement
Abn logo
Advertisement

Viral Video: రాత్రి పూట ఇంటి బయట అలికిడి.. ఆ మహిళ తలుపు తీయగానే ఎదురుగా ఎలుగుబంటి ప్రత్యక్ష్యం.. ఆ తర్వాత..

ఇంటర్‌నెట్ డెస్క్: ఇంటిముందు ఎలుగుబంటి కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు? ముందు భయంతో వణికిపోతారు. ఆ తర్వాత ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. అనంతరం అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందిస్తారు. అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..


ఓ మహిళకు రాత్రి పూట ఇంటి బయట అలికిడి వినిపించింది. ఏమైందా.. అని ఆమె ఇంటి తలుపులు తెరవగానే ఆమెకు అక్కడ ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. అయితే ఆ మహిళ భయపడిపోయి తలుపులు మూసేయకుండా అక్కడే నిల్చొని ఎలుగుబంటితో మాట్లాడింది. తలుపులు మూయి అని ఎలుగుబంటిని రిక్వెస్ట్‌ చేయడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. అపుడు ఆ ఎలుగుబంటి అక్కడే నిల్చున్న మహిళను కొద్దిసేపు చూసి చూసి గది లోపలికి అడుగుపెట్టింది. అయినా కూడా ఆ మహిళ భయపడకుండా తలుపులు మూయమని ఎలుగుబంటిని ప్రాధేయపడింది. అపుడు లోపలికి వచ్చిన ఆ ఎలుగుబంటి ఇంకొన్ని అడుగులు ముందుకు వేసి డోర్ హ్యాండిల్‌ని నోటితో పట్టుకుని ముందుకు లాగింది. ఆ తర్వాత తలుపు పూర్తిగా మూసేసింది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు. 

యూట్యూబ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పటివరకు 92 వేల వ్యూస్ దక్కించుకుంది. ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఎలుగుబంటి భాష తమకు రాదని, కానీ ఈ ఎలుగుబంటి మాత్రం చాలా వినయంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు తెలియరాలేదు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement