Viral Video: ఏమాత్రం భయ పడకుండా ఈ మహిళ చేసిన పనికి ఒడ్డుకు చేరుకున్న మొసలి అట్నుంచి అటే పరార్..!

ABN , First Publish Date - 2021-11-16T00:42:22+05:30 IST

మీరు ఓ నదీతీరం వద్ద నిలబడ్డారు.. ఇంతలో నీళ్లలోంచి ఓ మొసలి బయటకొచ్చింది. మరి మీరు ఏం చేస్తారు..? దాన్ని తరిమేస్తారా లేదా..

Viral Video: ఏమాత్రం భయ పడకుండా ఈ మహిళ చేసిన పనికి ఒడ్డుకు చేరుకున్న మొసలి అట్నుంచి అటే పరార్..!

ఇంటర్నెట్ డెస్క్:  మీరు ఓ నదీతీరం వద్ద నిలబడ్డారు.. ఇంతలో నీళ్లలోంచి ఓ మొసలి బయటకొచ్చింది. మరి మీరు ఏం చేస్తారు..? దాన్ని తరిమేస్తారా లేదా.. మీరే అక్కడి నుంచి జంపైపోతారా..? రెండో ఆప్షనే ఎంచుకుంటారు కదూ..! కానీ ఈ వీడియోలోని మహిళ మాత్రం అలా కాదు..పూర్తిగా డిఫరెంట్! మొసలి తనవైపే వస్తోందని ముందుగానే పసిగట్టింది. కాస్తంత దగ్గరకు రానిచ్చింది. ఆ తరువాత.. చెప్పు చేతిలోకి తీసుకుని ఊపుతూ ఇటొస్తే చెంప పగిలిపోతుంది అన్నట్టు పెద్దగా అరుస్తూ సైగలు చేసింది. అంతే.. ఆ మొసలి వెనక్కి అట్నుంచి అటే పరారైపోయింది. 


ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన వారందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘‘చెప్పుదెబ్బలంటే ఎవరికైనా భయమే..అదో విశ్వభాష.. దాని ప్రభావం గురించి తెలియని వారుండరు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ వీడియోకు కాస్తంత సెంటీమెంట్ జోడించారు. ఆమె పక్కనే తచ్చాడుతున్న కుక్క పిల్ల గురించి ప్రస్తావిస్తూ ఈ సీన్‌కు మరో కోణాన్ని తెరమీదకు తెచ్చారు. దీని ప్రకారం..   బిడ్డలాగా సాకుతున్న తన కుక్క పిల్లను తినేందుకు వచ్చినట్టు ఫీలైన ఆమె ఇలా మొసలికే షాకిచ్చిందట. ‘‘బిడ్డ జోలికొస్తే.. ఏ తల్లైనా అంతేగా’’ అంటూ ముక్తాయించారు. అయితే.. ఈ వీడియో కొత్తదేమీ కాదట. 2016 నుంచీ ఇది నెట్టింట్లో చక్కర్లు కొడుతోందని, కొందరు సీనియర్ నెటిజన్లు చెప్పుకొచ్చారు. సో..మీరూ ఈ వీడియోను చూశారంటే గ్యారెంటీగా ఎంజాయ్ చేస్తారు..!



Updated Date - 2021-11-16T00:42:22+05:30 IST