వైరల్ వీడియో: విమానంలో సీనియర్ సిటిజెన్‌ని కొట్టి, ఉమ్మేసిన మహిళ.. అతను ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-03T10:31:28+05:30 IST

ప్రయాణంలో ఉన్న ఒక విమానంలో ఒక మహిళ ఒక సీనియర్ సిటిజెన్‌ అయిన తన తోటి ప్యాసింజర్‌తో గొడవ పడి, అతనికి కొట్టి.. ముఖంపై ఉమ్మేసింది. ఇదంతా విమానంలోని మరో ప్యాసింజర్ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది...

వైరల్ వీడియో: విమానంలో సీనియర్ సిటిజెన్‌ని కొట్టి, ఉమ్మేసిన మహిళ.. అతను ఏం చేశాడంటే..

ప్రయాణంలో ఉన్న ఒక విమానంలో ఒక మహిళ ఒక సీనియర్ సిటిజెన్‌ అయిన తన తోటి ప్యాసింజర్‌తో గొడవ పడింది. అంతేకాదు అతడిని కొట్టి.. ముఖంపై ఉమ్మేసింది. ఇదంతా విమానంలోని మరో ప్యాసింజర్ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..


అమెరికాలోని  టంపా నుంచి అట్లాంటాకు వెళ్లే డెల్టా విమానంలో ప్రయాణిస్తున్న కార్న్‌వాల్ అనే మహిళ విమానంలో బాత్రూంకి వెళ్లింది. తిరిగి వస్తున్న సమయంలో అమె తన సీటు వద్దకు వెళ్లడానికి ఫుడ్ సప్లై చేసే బండి అడ్డుగా ఉంది. దీంతో బండిని జరపమని ఆమె విమాన సిబ్బందిని అడిగింది. ఆ సమయంలో పక్కనే ఉన్న ఒక పెద్ద మనిషి.. ఇప్పుడు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. కాసేపు పక్కనే ఉన్న ఖాళీ సీటులో కూర్చోమని చెప్పాడు. దీంతో కార్న్‌వాల్‌కు కోపం వచ్చింది. అమె అతనిపై గట్టిగా అరుస్తూ మాట్లాడింది. "నేనేమైనా రోసా పార్క్స్ నా?" అంటూ - 1955లో ఒక నల్లజాతీయుడికి బస్సులో సీటు ఇవ్వడానికి నిరాకరించిన ఘటన గురించి ప్రస్తావించింది. ఆమె మాటలకు ఆ పెద్ద మనిషి, పక్క సీటు వారంతా బదులిచ్చారు.


"నువ్వు నల్లజాతీయురాలివి కాదు, ఇది అలబామా కాదు. అంతకంటే ఎక్కువగా ఇది బస్సు కాదు." అని ఆమెకు బదులిచ్చారు. దీంతో అది ఘర్షణకు దారితీసింది. ఇద్దరూ చాలాసేపు మాటకు మాట బదులిచ్చి గొడవ పడ్డారు. చివరగా కార్న్‌వాల్ ముఖంపై మాస్క్ సరిగా పెట్టుకోకపోవడంతో ఆమెను ముందు మాస్క్ సరిగాపెట్టుకో అని చెబుతూ ఒక బూతు పదం వాడాడు. దీంతో కోపోద్రిక్తురాలైన కార్న్ వాల్ ‘నన్ను అంత మాట అంటావా.. ’ అంటూ అతని మీద చేయి చేసుకుంది. ఇది చూసిన విమాన సిబ్బంది.. ఆమెను తీసుకొని వెళుతుండగా.. కార్న్‌వాల్ పోతూ.. పోతూ ఆ ముసలి వ్యక్తి ముఖంపై ఉమ్మేసింది. 


విమానం ఎయిర్‌పోర్టులో దిగాక.. కార్న్‌వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై ఆ ముసలి వ్యక్తి ఫిర్యాదు చేయగా.. తోటి ప్రయాణికులు ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఆమెకు అమెరికన్ చట్ట ప్రకారం దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తేలితే, ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, $1,00,000 వరకు జరిమానా విధించబడుతుంది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం  ట్విట్టర్‌లో 9 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. 




Updated Date - 2022-01-03T10:31:28+05:30 IST