వామప్‌లో వినూత్నం..

ABN , First Publish Date - 2020-10-17T08:45:31+05:30 IST

ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ అందుకోవాలని పట్టుదలగా ఉన్న ఆర్‌సీబీ ఆ దిశగా అడుగులేస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ...

వామప్‌లో  వినూత్నం..

 స్టెప్పులేసిన విరాట్‌

దుబాయ్‌: ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ అందుకోవాలని పట్టుదలగా ఉన్న ఆర్‌సీబీ ఆ దిశగా అడుగులేస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలిచింది. అయితే గురువారంనాటి మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో ఓడినా..ప్లేఆఫ్స్‌ చేరేందుకు ఆ జట్టుకు మెరుగైన అవకాశాలున్నాయి. ఇకపోతే..కింగ్స్‌ లెవెన్‌ పోరుకు ముందు వామప్‌ సందర్భంగా ఆర్‌సీబీ కెప్టెన్‌ కోహ్లీ చేసిన నృత్య విన్యాసాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జట్టు సహచరులను ఉత్సాహపరిచేందుకు, వారిలో ఉల్లాసం నింపేందుకు విరాట్‌ వినూత్నంగా ప్రయత్నించాడు. కాళ్లను అటూఇటూ ఊపుతూ, వేగంగా అటూఇటూ దొర్లుతూ, ఒక కాలు పైకిలేపి చేత్తో క్రాఫ్‌ను సరి చేసుకుంటూ.. ఆపై నిల్చొని స్టెప్పులేస్తూ.. మొత్తంగా వామప్‌ను కోహ్లీ ఇలా ఎంజాయ్‌ చేస్తూ కనిపించాడు.

Updated Date - 2020-10-17T08:45:31+05:30 IST