దయచేసి ఇంట్లోనే ఉండండి.. ఫ్యాన్స్‌ని కోరిన విరుష్క

ABN , First Publish Date - 2020-03-25T20:38:08+05:30 IST

కరోనా మహమ్మారి కమ్మేస్తుండడంతో కేంద్రం దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్‌ డౌన్‌

దయచేసి ఇంట్లోనే ఉండండి.. ఫ్యాన్స్‌ని కోరిన విరుష్క

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కమ్మేస్తుండడంతో కేంద్రం.. దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు దీనికి మద్దతు తెలుపుతూ తగిన జాగ్రత్తలు పాటించాలంటూ తమ అభిమానులకు సూచనలు ఇస్తున్నారు. తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతని సతీమణి అనుష్క శర్మ ప్రధాని నిర్ణయానికి మద్దతు తెలిపారు. ప్రధాని సూచనల మేరకు ప్రజలు తమ ఇళ్లు వదిలి రావొద్దంటూ సోషల్‌మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. 


‘‘ఇది చాలా క్లిష్ట సమయం మనందరం ఈ తీవ్రమైన పరిస్థితిని అర్థం చేసుకుందాం. ఈ మహమ్మారిని ఎదురుకొనేందుకు మనం అందరం కలిసి కట్టుగా పోరాడుదాం. ఇది మా తరఫున అందరికీ అభ్యర్థన’’ అంటూ విరాట్ ట్వీట్ చేశాడు. 


‘‘కరోనా వైరస్‌తో జరిగే యుద్ధాన్ని గెలవాలంటే ఈ 21 రోజులపాటు మీరు బాధ్యతాయుతంగా ఉండటంమే. కరోనాని తరిమికొట్టాలంటే ఇంట్లోనే ఉండండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. కర్ఫ్యూను దయచేసి ఉల్లంఘించకండి. ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. గోల చేయడం ద్వారా కరోనాపై యుద్ధాని గెలవలేము. అంతేకాక.. రకరకాల వదంతులను, పుకార్లను దయచేసి నమ్మకండి. మీ ఒక్కరి నిర్లక్ష్యం వల్ల మీకే కాదు యావత్ దేశం కూడా కష్టాన్ని ఎదురుకోవాల్సి వస్తుంది. 21 రోజుల పాటు ఇండియా ఇంట్లోనే ఉండాలి. ఐక్యత చూపించండి.. జీవితాన్ని మరియు దేశాన్ని కాపాడండి’’ అంటూ వారిద్దరు కలిసి ఆ ట్వీట్‌కి ఓ వీడియోని కూడా జత చేశారు. 


అయితే ప్రధాని 21 రోజుల నిర్భందం గురించి ప్రకటన చేసిన వెంటనే విరాట్ దానికి మద్దతుగా ట్వీట్ చేశాడు. ‘‘ఈరోజు అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిర్భందం ఉంటుందని ప్రధాని తాజాగా ప్రకటన చేశారు. నేను కూడా అందరిని అదే కోరుకుంటున్నాను. దయచేసి ఇంట్లోనే ఉండండి. కోవిడ్-19ని చికిత్స వ్యక్తిగత దూరం పాటించడమే’’ అంటూ విరాట్ పేర్కొన్నాడు. 

Updated Date - 2020-03-25T20:38:08+05:30 IST