చెత్త రికార్డులో ద్రవిడ్, కపిల్ దేవ్‌ను దాటేసిన కోహ్లీ

ABN , First Publish Date - 2022-01-22T02:14:52+05:30 IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో డకౌట్ అయిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో

చెత్త రికార్డులో ద్రవిడ్, కపిల్ దేవ్‌ను దాటేసిన కోహ్లీ

పార్ల్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో డకౌట్ అయిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. ఈ మ్యాచ్‌లో ఐదు బంతులు ఆడిన కోహ్లీ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బౌలింగులో కవర్ ఫీల్డర్ తెంబా బవుమాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.


వన్డేల్లో కోహ్లీ డకౌట్ కావడం ఇది 14వ సారి. ఇక, స్పిన్నర్‌కు దొరికిపోవడం ఇదే తొలిసారి. ఈ అవుట్‌తో కోహ్లీ వన్డేల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం కోచ్ రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్‌లను అధిగమించాడు.


వన్డేల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. టెండూల్కర్ వన్డేల్లో 20 సార్లు పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో జవగళ్ శ్రీనాథ్ (19), అనిల్ కుంబ్లే (18), యువరాజ్ సింగ్ (18), హర్భజన్ సింగ్ (17), సౌరవ్ గంగూలీ (16), జహీర్ ఖాన్ (14), కోహ్లీ (14), సురేశ్ రైనా (14), వీరేంద్ర సెహ్వాగ్ (14), రాహుల్ ద్రవిడ్ (13), కపిల్ దేవ్ (13) ఉన్నారు. వరుసగా 64వ ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీ సెంచరీ లేకుండానే పెవిలియన్ చేశాడు. అంతేకాదు, ఈ 64 ఇన్నింగ్స్‌లలో కోహ్లీకి ఇది ఏడో డకౌట్ కావడం గమనార్హం.

 

 

Updated Date - 2022-01-22T02:14:52+05:30 IST