నా కెప్టెన్‌ విరాటే: రహానె

ABN , First Publish Date - 2021-01-27T06:53:19+05:30 IST

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ను అద్భుతంగా నడిపించి సారథిగా అజింక్యా రహానె అందరిచేతా శెభాష్‌ అనిపించుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో అతడినే కెప్టెన్‌ చేయాలనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి...

నా కెప్టెన్‌ విరాటే: రహానె

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ను అద్భుతంగా నడిపించి సారథిగా అజింక్యా రహానె అందరిచేతా శెభాష్‌ అనిపించుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో అతడినే కెప్టెన్‌ చేయాలనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. కానీ తమ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాత్రమేనని రహానె స్పష్టం చేశాడు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే తాను బాధ్యతలు తీసుకుంటానన్నాడు. ‘కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాక మార్పులేమీ ఉండవు. టెస్టు కెప్టెన్‌ ఎప్పటికీ కోహ్లీనే. నేను అతడి డిప్యూటీని మాత్రమే. విరాట్‌ గైర్హాజరీలో జట్టును నడిపించడం నా బాధ్యత. దాన్ని సక్రమంగా నిర్వర్తించినందుకు సంతోషంగా ఉంది. కెప్టెన్‌గా మ్యాచ్‌ను లేక సిరీ్‌సను గెలిచామంటే అది సమష్టి ప్రదర్శనతోనే సాధ్యం. అంతేకానీ ఒక వ్యక్తి వల్లే సాధ్యం కాదు’ అని రహానె అన్నాడు.


Updated Date - 2021-01-27T06:53:19+05:30 IST