అనుష్కే నా బలం అంటూ పిక్ పోస్ట్ చేసిన Virat Kohli.. ఫోటో వైరల్.. గంటలో 25 లక్షల లైక్స్..

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దేశంలోని లవబుల్ కపుల్స్‌లో ఒకరు. వారు తరచుగా సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు ఫోటోలను పంచుకుంటూ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. తాజాగా విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉన్న అందమైన చిత్రాన్ని పోస్ట్ చేశాడు. దానికి విరాట్ ‘మై రాక్ (నా బలం)’ అని రాశాడు.


పోస్ట్ చేసిన గంటలోనే 25 లక్షలకు పైగా లైక్స్ సాధించింది ఈ కపుల్ పిక్. చాలా మంది అభిమానులు దీనిపై కామెంట్స్ పెట్టడంతో ఫోటో వైరల్‌గా మారింది. కొందరు ‘చాలా కాలం తర్వాత!!! విరుష్క ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు’ అని పెట్టగా.. మరి కొందరు ‘ఎంతో అందమైన పిక్’ అంటూ కామెంట్ పెట్టారు.


చాలా కాలం నుంచి వెండితెరపై కనిపించని అనుష్క ఇటీవల తన రెండు స్టన్నింగ్ పిక్స్‌తో ఫ్యాన్స్‌కి కనులవిందు కలిగించింది. అందులో ఈ బ్యూటీ నియాన్ గ్రీన్ మోనకిని స్విమ్‌వేర్‌లో ఉంది. స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న ఆ పిక్స్ సైతం దాదాపు 30 లక్షల లైక్స్, వందలకొద్ది కామెంట్స్ సాధించి వైరల్‌గా మారాయి. మీరు వాటిని ఓ సారి చూసేయండి మరి..


Advertisement

Bollywoodమరిన్ని...